సగ్గు బియ్యం కట్లెట్ - సెలవులు అంటే బయిటికి వెళ్లి తినాలి అంటారు కదా అలా బయిటివి తినకుండా ఇంట్లోచేసినవే తినాలి అంటే ఈ రకము కూడా చేసి చూడండి
చాల సులబము .
కావలిసిన పదార్థములు =
>> పచ్చిమిరపకాయముక్కలు - కాస్త
>> సగ్గుబియ్యము - 1 CUP
>> బియ్యము పిండి[లేక]కార్న్ ఫ్లోర్-2tsp
>> ఉప్పు - తగినంత
>> ఒట్టి కారము - 1/4 tsp
>> చాట్ మసాల - 1/2 tsp
>> పుదినా ఆకు - ఒక చిన్న కప్
>> కొత్తిమీర - కాస్త
>> కరివేపాకు - కాస్త
>> ఉర్లగడ్డ [ఆలుగడ్డ] - 1
>> చామ గడ్డలు [చమడుంపలు] - 4
>> ఉల్లి గడ్డ - 1
>> బ్రెడ్ పొడి - ఒక కప్పు
>> నూనె - డీప్ ఫ్రయ్ కి
- మొదట సగ్గుబియ్యము ఒక నాలుగు గంటలముందర నాన బెట్టుకొని పెట్టుకోవాలి .
- పుదిన,కొత్తిమీర,కరివేపాకు అన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి .
- ఉల్లిగడ్డ పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి
- ఆలుగడ్డ,చామగడ్డలు అన్ని కుక్కర్ ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని మెత్తగా చిదుముకోవాలి.
- మిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి .
- బ్రెడ్ పొడి రెడీగా బజారులో దొరుకుతుంది లేకపోతే బ్రెడ్ ఎండ బెట్టుకొని గ్రింద్ చేసుకోవచ్చు .
పైన చెప్పుకున్న వస్తువులు అన్ని బ్రెడ్నా పొడి తప్ప అన్ని వస్తువులు నాన బెట్టుకున్న సగ్గుబియ్యము లోని నీరు వంచుకొని వేసి బాగా కలుపుకోవాలి ఇలా ............
తరువాత పొయ్యి మీద పెన్నములో నూనె వేసుకొని
కాగేలోపలికి కట్లెట్స్ మాదిరి చేసుకొని బ్రెడ్ పౌడర్ లో అద్దాలి ఇలా ...........................
తరువాత కాగుతున్న నూనెలో వేసుకొని మద్యస్తపు మంట మీద కాల్చుకొని టమోటా సాస్ కానీ చిల్లి సాస్ తో కానీ ఇవ్వండి.
పిల్లలికి చాలా బాగా నచ్చుతుంది
No comments:
Post a Comment