చింత పండు వూర్ పచ్చిమిరపకాయలు = ఇవి పప్పు ,పెరుగు అన్నములోకి నంచుకొని తినడానికి బాగుంటాయి .
పుల్ల పుల్లగా కాస్త కరంగా బాగుంటాయి
టమోటా ఎర్రకారము పప్పులోకి ఇంకా బాగుంటాయి తెలుసా చేయండి మరి .................
వీటి తయారికి కావలిసిన పదార్థములు =
>> సప్పవి పచ్చి మిరపకాయలు - 10
>> చింతపండు పులుసు - 1/2 cup
>> సరిపడా ఉప్పు
>> జీలకర్ర పొడి - 1/2 tsp
>> నూనె - 1 tsp
::::::: తయారు చేసుకునే పద్ధతి =
మొదట పచ్చిమిరప కాయలు సప్పవి తీసుకొని కడిగి తుడుచుకొని మధ్య లో గాట్లు పెట్టుకోవాలి
పెన్నము పెట్టు కొని నూనె వేసి కాగినాక గట్లు పెట్టుకున్న మిరపకాయలు వేసు కొని తెల్ల చుక్కలు వచ్చేవరకు [మిరపకాయల మీద] వేయించుకొని తరువాత మొదటే చిక్కగా పిసుకుకొని ఉంచుకున్న చింత పండు పులుసు
వేసి పసుపు కాస్త ,జీలకర్ర పొడి,ఉప్పు,అన్ని వేసుకొని బాగా దెగ్గర పడినాక దించుకొని చల్లారినాక పప్పు అన్నములో కానీ పెరుగు అన్నము లో కాని తినండి ..........
No comments:
Post a Comment