మామిడికాయ పులుసు = ఈ ఎండాకాలం యండలు చాలా పెరిగినాయి . ఈ ఎండలకు చలువ పదార్తలు తింటే మంచిది కదా, అన్నములోకి కూడా కాస్త నీటి పదార్తలు వుంటే బాగుంటాయి , అలంటి పదార్తమే మామిడికాయ పులుసు , ఇది తియ్య తియ్యగా కాస్త పుల్లగా వుంటది .
పులుసుకు కావలిసిన పదార్తములు =
- మామిడికాయ ముక్క - 1/2 చంప [ముక్క]
- కారము ఒట్టిది [ఎర్రది] - 3/4 tsp
- ఉప్పు - 1/4 tsp
- బెల్లము - ఒక ఉంట [తీపు సరిపడా]
- పసుపు - 1/4 tsp
- ఉల్లిగడ్డలు - 1 పెద్దది
- నూనె - 1/2 tsp
- తిరవాత గింజలు - 1/2 tsp [ఆవాలు,జీలకర్ర,మినపప్పు]
- శనగపిండి - 3/4 tsp
తాయారు పద్దతి = మొదట కుక్కర్ లో మామిడికాయ ముక్కలు,పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి .
తరువాత పెన్నము పెట్టుకొని నూనె వేసి తిరవాత గింజలు వేసి వేగినాక ఉల్లిగడ్డలు వేసి ఎర్రగా అయినాక 1/2 గ్లాస్సు నీళ్ళు పోసుకొని ,
దానిలో ఉప్పు,కారము,పసుపు,బెల్లము వేసి ఉడకనిచ్చుకోవాలి.
ఉల్లిగడ్డలు ఉదికినాక ఉడికిన మామిడికాయ గుజ్జు కూడా వేసుకొని ఉదికిన్చుకొని పక్కన నీటిలో శనగ పిండి వేసుకొని కలిపి ఉడుకుతున్న గుజ్జులో వేసు కోవాలి , కావాలి అంటే నీరు వేసుకోండి మీకు కావలిసిన చిక్క దానము బట్టి . అంటే మామిడి కాయ పులుసు తయ్యార్ ........
No comments:
Post a Comment