సంక్రాంతి పండగ సిరుల పండగ కద ఏమి అంటారు , ఈ పండుగ అప్పుడు ఎన్నో రకాలు వంటలు చేసుకుంటారు అలా చేసుకునే వాటిలో ఇది ఒక తప్పని సరి వంట ఇది భోగి రోజు చేసుకుంటారు ఇంక మీకు నేర్పుతాను నేర్చుకోండి చేసుకోండి చాలా బాగుంటుంది రుచి ,ఆరోగ్యానికి మంచిది కూడా మరి పదండి వంట ఇంటికి .......................
కావలిసిన పదార్థములు -
కావలిసిన పదార్థములు -
- బియ్యము - 1 గ్లాస్
- పెసర బేడలు - 1/2 గ్లాస్
- పసుపు - 1/4 tsp
- ఉప్పు - 1/4 tsp
పచ్చడి కి కావలిసినవి -
- వంకాయలు - 4
- ఉల్లిగడ్డలు - 2- 3
- పచ్చిమిరపకాయలు - 5- 6
- చింతపండు - 1/2 inch
- నూనె - 2 -3 tsp
- బెల్లము - 1 tsp
- ఉప్పు - తగినంత
- కుక్కర్ లో బియ్యం , పెసర బేడలు వేసుకొని రెండు సార్లు కడిగి మూడు నీళ్ళు వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని కుక్కర్ మూత మూసుకొని మూడు విసిల్స్ వస్తేనే పొయ్యి బ్యాండ్ చేసుకొని పెట్టుకోండి .
- ఉల్లిగడ్డలు , వంకాయలు ,పచ్చిమిరపకాయలు కడిగి ముక్కలు చేసుకోవాలి ........వెంటనే పొయ్యి ముట్టించి పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని కాగిన తరువాత కోసుకున్న ముక్కలు వేసుకొని మగ్గ బెట్టుకొని .
- తగినంత చింతపండు , ఉప్పు , బెల్లము వేసుకొని ఒకసారి తిప్పుకొని .......
- చల్లారినాక మిక్సీ జార్ లో మగ్గబెట్టుకున్న వంకాయలు వేసుకొని [ దీనిలో ఉల్లిగడ్డలు కొన్ని తీసుకొని ఒక గిన్నలో కి తీసుకోండి ]
- కచ్చ పచ్చాగా తిప్పుకొని ముందుగా తీసుకున్న వుల్లిగడ్డల గిన్నలోకి తీసుకున్న గిన్నలోకి తీసుకోవాలి అంతే పచ్చడి తయ్యార్ ......................
ఇప్పుడు విసిల్ వస్తుంది చూడండి ఇంక ఇప్పుడు ఒక గంటె తో కాస్త పులగం ని కలిపి వేడి వేడి పులగం లో నెయ్యి వేసుకొని ఈ చింతపండు వంకాయ పచ్చడి వేసుకొని తినండి చాలా బాగుంది కదా ................
PS:Please leave a comment once you are done.
Thank You!
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment