Top Food Blogs

Friday, February 1, 2013

BREAD WITH TOMATO AALOO CURRY

ఆదివారం  అందరికి  సులువు కావాలి  కదా  అదే  తొందరగా  చేసేది  అలాగే   రుచికరమయినది  కావాలి  అలాంటిది   ఏంటి " బ్రెడ్" . ఆ  బ్రెడ్  తో  ఎన్నో  రకాలు  చేసుకోవచ్చు  అలాగే   ఇది   ఒక   రకము , మా  ఆడబిడ్డ    చెప్పినది , చాలా  బాగుంటుంది , చేసుకోవడము  సులువే  రుచికి  రుచి  సులువుకి సులువు . మీ  పిల్లలు  అందరు   కలిసి   ఒకొక్కటి  చేయండి  తమాషాగా   అలాగే అందరు  కలిసి   తినండి  కబుర్లతో   ఈ  ఆదివారం   ఏమంటారు  ..................... పదండి   వంటింటికి   ఒకరు  అంగడికి  ఒకరు  అదే  బ్రెడ్  తేవటానికి పదండి  మరి ....... ; )

కావలిసిన   పదార్థములు  - 

  1. బ్రెడ్  - 1 ప్యాకెట్ 
  2. ఉల్లిగడ్డలు  - 3 
  3. వుర్లగడ్డలు / బంగాలదుంపలు  -  3 మధ్యస్తంవి 
  4. టమోటా  పండ్లు  -  5 
  5. ఉప్పు  
  6. ఒట్టి  కారము  - 3/4 tsp 
  7. నూనె  - 3 tsp  
  8. చెక్కర  - 1/4 tsp 
తయారు చేసుకుందాము  - 
  1. మొదట  ఉల్లిగడ్డలు  పొట్టు  తీసుకొని , కడిగి , సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి 
  2. తరువాత ఉర్ల గడ్డలు  పొట్టు  తీసుకొని , కడిగి  , సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి 
  3. తరువాత టమోటాలు కడిగి  తీసుకొని , సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి .
  4. ఒక  మూకుడు  పెట్టుకొని   నూనె   వేసుకొని  వుర్లగడ్డలు ,  ఉల్లిగడ్డలు వేసుకొని   బాగా కలపాలి మధ్యస్తపు  మంట  మీద  
  5. కాస్త   పసుపు , ఉప్పు    వేసుకొని  కలిపి  మూత   ముసి   పెట్టుకోవాలి  ఇవి అర్ధము  మగ్గినాక  
  6. తరుగుకున్న   టమోటా  ముక్కలు  వేసుకొని  బాగా కలిపి  మగ్గనీయాలి [ మూత  ముయకండి  నీరు  ఊరుతుంది బాగుండదు ]
  7. అన్ని మగ్గినాక   తగినంత కారము , కాస్త చెక్కర  వేసి కలిపి  సరిపోకుంటే  కాస్త ఉప్పు వేసుకొని బాగా  కలిపి  ఒక 5 నిముషముల  తరువాత   దించుకోవాలి .
note  - కూర  మరీ  ఉప్పగా  కారముగా  ఉండకూడదు  , కాస్త  తియ్యగా  వుండే  బ్రెడ్  కి  కాస్త పుల్లగా  కాస్త కారముగా   వుండే  ఈ కూర  ఎంతో  బాగుంతుంటి  నంచుకొని  తింటే  మరి  .

PS:Please leave a comment once you are done.
      Thank You!
ammachethiruchi.blogspot.com

No comments:

Post a Comment