Top Food Blogs

Monday, December 5, 2011

MIIRIYALA RASAM [ ANNAMU LOKI (OR) FOR RICE ]

మిరియాల రసం = మిరియాల రసం ఎంతో రుచిగా బాగుంటుంది.ఇప్పుడు ముందే చలి కాలము కదా కాస్త ఘాటుగా వుండే ఈ చారు తింటే చాల బాగుంటుంది తెలుసా 
కావలిసిన వస్తువులు : 

  • టమోటా పండ్లు - 2 
  • ఉప్పు - తగినంత 
  • ఒట్టి కారము - కాస్త 
  • చింతపండు - కాస్త 
  • ఇంగువ - కాస్త 
  • మిరియాలు - 9
  • ఎల్లిపాయలు - 4
  • కరివేపాకు 
  • కొత్తిమీర 
  • కందిపప్పు - ఒక కప్పు 
  • బెల్లము - కాస్త
  • తిరవాతకు -కాస్త నూనె:1/2 tsp  (మినపబేడలు,ఆవాలు,జీలకర్ర)
తాయారు చేసుకునే పద్ధతి - 


మొదట  ఒక గిన్న తీసుకొని దానిలో టమోటా పండ్ల ముక్కలు,ఉప్పు,కారము,చింతపండు,బెల్లం,కరివేపాకు  అన్ని వేసుకోవాలి ఇలా ..................


తరువాత ఒక పెద్ద గ్లాస్ నీరు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి .
వుడుకుతున్నప్పుడు మిరియాలు,ఎల్లిపాయలు,ఇంగువ వేసుకొని దంచుకోవాలి మరి మెత్తగా ఉండకూడదు 


కందిపప్పు ఉడక బెట్టుకొని మెత్తగా చేసుకొని ఉడుకుతున్న చారులో వేసుకొని ,తరువాత పక్కన ఒక పెన్నము పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని తిరవత వేసుకొని ,కరివేపాకు,కొత్తిమీర వేసుకొని  ఒక ఉడుకు రానిచ్చినాక  పొయ్యి బంద్ చేసుకొని వేడి వేడి అన్నములో  వేసుకొని కలుపుకోవాలి అంటే ఎంతో రుచికరమయిన మిరియాల చారు [రసం] తయ్యర్........................

No comments:

Post a Comment