Top Food Blogs

Monday, October 24, 2011

AA KAAKARA KAAYA GUTTI KURA [ CURRY FOR RICE & ROTIES ]

  కాకర  కాయలు : -   ఈ కాకర కాయలు మాములు కాకర కాయల మాదిరి చేదుగా వుండవు బాగుంటాయి కానీ  మాములు  కాకరకాయల  ఫలితము వుంటుంది

వీటినే  ఆకాకరకాయలు అని అంటారు  అయితే  నేర్చుకుందామా మరి ..................

కావలిసిన పదార్థములు =
  1. ఆ కాకరకాయలు- 6 
  2. నూనె - 5tsp
  3. అల్లము వెల్లుల్లి  పేస్టు - 1 tsp 
  4. మిరియాల పొడి - 1 tsp
  5. ఉప్పు - తగినంత 
  6. ఒట్టి కారము - 11/4 tsp [ తగినంత ]
  7. ఉల్లిగడ్డలు - పెద్దవి అవుతే :- 2
  8. టమోటాలు - పెద్దవి అవుతే :- 4
  9. ధనియాల  పొడి - 1 tsp
  10. కొత్తిమీర - కాస్త 
తాయారు చేసుకునే పద్ధతి =
  • మొదట  ఆకాకరకాయలను  బాగా  కడిగి పైన  కాడలు కోసి  మద్యలో నాలుగు పక్షాలుగా కోసుకోవాలి ,
[గుత్తి వంకా యకు కోసుకున్నట్లు కోసుకోవాలి]  
ఇలాకోసుకున్న కాకరకాయలని  ఒక గిన్నలో నీళ్ళు పోసి ఒక ఉడుకు  వచ్చిన తరువాత  పొయ్యి  బంద్ చేసుకొని నీరు అంత వంచేసు కొని  ఈ  కాకరకాయలని ఒక ప్లేటు లోకి తీసుకోవాలి .
  • పక్కన పెన్నములో నూనె వేసుకొని మొదటే సన్న ముక్కలుగాకోసుకున్న ఉల్లిగడ్డలు వేసి ఉప్పు వేసి కలుపుకోవాలి ,ఒక నిముషము తరువాత అల్లము వెల్లుల్లి పేస్టు వేసుకొని సువాసన వచ్చేవరకు వేయించుకోవాలి తరువాత ధనియాలపొడి , ఒట్టి కారము వేసుకొని మరి కాసేపు మగ్గ బెట్టుకొని పొయ్యి బంద్ చేసుకొని ఈ కూరని చల్లార నిచ్చి ఆ కాకర కాయలల్లో నిన్చుకోవాలి ఇలా ..........


  • మల్ల పొయ్యి  మీద పెన్నము పెట్టుకొని ఒక నాలుగు 
స్పున్ల  నూనె వేసుకొని కాగినాక మంట సన్నగా చేసుకొని ఈ నిన్చుకున్న కాకరకాయలను పెన్నములో వేసుకొని  కాస్త కలిపి మూత పెట్టి, మూత మీద నీరు వేసుకోండి [ఎందుకు అంటే కూర కింద మాడకుండా వుంటుంది కాబట్టి]

మధ్య మధ్య లో కకారకాయలను తిప్పుతూ వుండాలి అప్పుడు సమంగా కాలుతాయి ,వేగిన తరువాత టమోటా పడ్ల గుజ్జు ,మిగిలి వుంటే నిన్చుకున్న మసాల ,మిరియాల పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక అయిదు నిముషముల తరువాత మూత తీసి కూర దెగ్గర పడినాక కొత్తిమీర వేసుకొని దించుకోవాలి అంతే కూర తయ్యార్ ..........................





No comments:

Post a Comment