Top Food Blogs

Wednesday, March 2, 2011

IDLY [ WITH IDLY RAVVA ] , SAMBAR , CHATNEES

ఇడ్లీ చట్నీసాంబార్:

ఇడ్లీ రవ్వ తో చేసే ఇడ్లీలు :



కావలిసిన పదార్థములు-

ఉద్దిబెడలు (మినపబేడలు)- 2 గ్లస్సులు

ఇడ్లీ  రవ్వ - 4 గ్లస్సులు [రవ్వ అంగట్లో దొరుకుతుంది]

ఒక  6  గంటల  ముందే  ఉద్దిబేడలు  నానబెట్టి  రుబ్బుకోవాలి , పక్కలో 
రవ్వ  ఒక  మూడు  సార్లు  కడుగుకోవాలి , రుబ్బుకున్న పిండిలో  ఈ  రవ్వ 
బాగా  పిండి  [నీరు పిండుకోవాలి]వేసుకోవాలి. అంతే  పిండి తయ్యార్  ,

ఇప్పుడు  [ఉదయం రుబ్బుకుంటే  రాత్రి ఇడ్లీ వేసుకోవచ్చు , రాత్రి  రుబ్బుకుంటే ఉదయం వేసుకోవచ్చు] ఇడ్లీ  స్టాoన్డు కు  నూనే పూసి, 
పిండి లో కావలిసినంత  ఉప్పు  సోలపొడి [cooking soda] వేసి  కలిపి  ఇడ్లి 
ప్లేటులో  వేసుకొని  స్టాండులో పెట్టి  10 mints పొయ్యిమీద పాత్ర పెట్టుకుంటే 
ఇడ్లి తయ్యార్ ..........

{పప్పుల  చట్ని{పచ్చి కొబ్బెర}                                            

పప్పుల  చట్నీకి  కావలిసినవస్తువులు :

పప్పులు - 1 కప్ 

పచ్చికోబ్బెర - 1/2 చిప్ప 

తగినంత ఉప్పు 

పచ్చిమిరపకాయలు - 4 

అల్లము కాస్త 

కొత్తిమీర 

తిరవతగింగాలు [మినప బేడలు,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,ఒట్టిమిరపకాయ]

నూనె
తాయారు చేసే పద్దతి :

పచ్చికోబ్బెర,పచ్చిమిరపకాయలు,ఉప్పు,అల్లము వేసి మిక్సీ వేసి తరవాత 
పప్పులు కాస్త నీరు వేసి తిప్పి ఎత్తుకోవాలి ,తరవాత తిరవతవేసుకోవాలి  
అంతే ..........
చెనక్కయాల [బుడ్డలు or పల్లీలు]చట్నీ :

కావలిసిన పదార్థములు :

వేయించుకున్న పల్లీలు - 1 కప్ 

వేయించుకున్న పచ్చిమిరపకాయలు -6 

ఉప్పు, పచ్చికోబ్బెర -1/4 చిప్ప 

బెల్లము కాస్త , చింతపండు ఒక గోరిస 

పైన  చెప్పినవన్న  మిక్సీ లో  వేసి తిప్పుకోవాలి , తరవాత పప్పుల చట్ని లాగా  దీనికి  తిరవాత  పెట్టుకోవాలి  అంతే చట్నీ  తయార్ర్ .......

ఇడ్లీ సాంబార్ :

ఉడక బెట్టిన కండి బేడలు -1 కప్,చింతపండు గుజ్జు,ఉప్పు,బెల్లము,పసుపు,
తిరవాత గింజలు [ఆవాలు,జీలకర్ర,మనపబెడలు,కరివేపాకు]నూనే,ఉల్లిగడ్డలు,టొమాటో ముక్కలు
  
సాంబార్ మసాలకు కావలిసిన వి :

ఒట్టి మిరపకాయలు -6 
ధనియాలు -1 tsp 
జీలకర్ర -1/2 tsp
ఒట్టి  కొబ్బెర -1/2tsp [తురుముకునది]
ఇంగువ కాస్త ,           ఇవన్ని కాస్త  నూనే వేసి సన్న మంట మీద వేయించి 
                                మిక్సీ చేసుకొని  పెట్టుకోవాలి,సాంబార్ పొడి తయ్యార్ .

   బాణలిలో రెండు చెంచాల నూనే వేసి తిరవాత గింజలు వేసి కరివేపాకు వేసుకొని  వేగినాక ఉల్లిగడ్డముక్కలు,పసుపు వేసి వేయించాలి . 

ఉల్లిగడ్డలు కాస్త వేగినాక టొమాటో ముక్కలు వేసి రేoడు నిమిషాలు వేగినాక ఉప్పు, బెల్లము,చింతపండు పులుసు,ఒక గ్లాస్సు  నీళ్ళు పోసి మూతపెట్టి  మగ్గినీయాలి .

మగ్గిన వుల్లిగడ్డలలో , ఉడకబెట్టిన కంది పప్పు మెత్తగా  ఎనుపుకొని , వేసి , తాయారు చేసుకున్న మసాలా పొడి వేసుకొని ,

 పడితే నీరుపోసుకొని ఉడకబెట్టుకొని కొత్తిమీర వేసుకొని  దించు కోవాలి .

సులబమయిన సాంబార్ :

బాణలిలో  తిరవాత వేసి  ఉల్లిగడ్డలు వేయించి కరివేపాకు టొమాటో ముక్కలు 
వేసి వేగినాక ఉప్పు,నలుగు ఎల్లిపాయలు దంచినవి,బెల్లము ,ధనియాల పొడి 
వేసి ఒక గ్లాస్సు నీరు పోసి ఉడికినాక ,ముందుగ  ఉదాకబెట్టుకున్న కందిపప్పు ,చింతపండు పులుసు వేసి ఉదికిన్చుకొని కొత్తిమీర వేసి దించుకోవాలి అంతే సాంబార్ తయ్యార్ ...........................
అల్లము పచ్చడి :

కావలిసిన పదార్తములు :

మినపబేడలు- 1 tsp [వేయించ్కోవాలి దోరగా]
శనగబేడలు- 1 tsp [వేయించ్కోవాలి దోరగా]
ధనియాలు -1/2 tsp [వేయిచుకోవాలి దోరగా]
అల్లము - సన్నగా కట్ చేసుకున్నవి ఒక 15 ముక్కలు [వేయించుకోవాలి 
                                                                                   ఎర్రగా ] 
చిoతపండు[నాన బెట్టుకున్నది]
బెల్లము,ఉప్పు [సరిపడా]
పైన  చెప్పుకున్నవాన్ని మిక్సీ లో వేసి తిప్పు కోవాలి మెత్తగా అంతే అల్లం 
పచ్చడి తయ్యార్ .....వేడి వేడి ఇడ్లీ లో అల్లం పచ్చడి బాగుంటాది......

[కావలింటే దేనికికుడా నలుగు స్పూన్ల నూనే వేసి తిరవాత వేసి పచ్చడి దానిలో వేసి రెండు నిమిషములు మగ్గబెట్టుకోవచ్చు]  

నోట్ : పిండి ఎంత వాడుకుంటే అంతలో మాత్రమే ఉప్పు కాలు పుకోండి పిండి పుల్లగా కాదు 

           
                                         


  

No comments:

Post a Comment